యూపీలో మహాకూటమితో సమన్వయం!


Fri,March 15, 2019 11:14 AM

We dont want SP and BSP ghatbandhan to lose

-అవసరమైన స్థానాల్లో అవగాహనతో పోటీ చేస్తాం
-ఢిల్లీలో ఆప్‌తో పొత్తుపై పునరాలోచన: వీరప్ప మొయిలీ

హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీల మహాఘట్‌బంధన్ (మహాకూటమి) ఓడిపోవాలని తాము కోరుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ కూటమి బలంగాలేని స్థానాల్లో అవగాహనతో పోటీ చేస్తామని తెలిపారు. రాజకీయంగా ఎంతో కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కాంగ్రెస్‌కు రెండు సీట్లు (అమేథీ, రాయబరేలీ) మాత్రమే వదిలిపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ఒంటరిగా రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, తాము అలా రెండు సీట్లు తీసుకోలేమని, అందుకే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులను ప్రకటించే సమయంలోనే.. కూటమిలో చేరకుండా సీట్లపై అవగాహనకు వచ్చే అవకాశముందన్నారు.

కొన్ని స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు మేము (కాంగ్రెస్), వారు (ఎస్పీ-బీఎస్పీ) ఒక అవగాహనను ఏర్పరచుకోవాల్సి రావచ్చు, అటువంటి సీట్లలో మహాకూటమి ఓడిపోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పారు. కాంగ్రెస్ బలంగా లేని స్థానాల్లో మహాకూటమికి మద్దతునిస్తారా అన్న ప్రశ్నకు ఆయన అవునని సమాధానమిచ్చారు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దన్న నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నామని మొయిలీ చెప్పారు. అనుకున్న స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కావడం లేదన్న వాదనను తోసిపుచ్చారు. అన్ని రాష్ర్టాల్లో ఎన్నికల ముందు పొత్తులు సాధ్యం కాకపోవచ్చన్నారు. కేరళలో తాము వామపక్షాలకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నామని, అక్కడ ఐక్యత సాధ్యం కాదని అన్నారు. అయితే బెంగాల్‌లో మాత్రం వారితో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయని చెప్పారు. ఉమ్మడి శత్రువైన బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగానే ఉన్నాయని తెలిపారు.

169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles