చైనా సరిహద్దుపై భారత్ దృష్టిసారించాలి: రావత్Sat,January 13, 2018 01:59 AM

Bipin_Rawat
న్యూఢిల్లీ, జనవరి 12: భారత్ తన దృష్టిని చైనా సరిహద్దుపై కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమైందని సైన్యాధికారి బిపిన్ రావత్ తెలిపారు. చైనా బలమైన దేశం అయినప్పటికీ భారత్ మాత్రం బలహీనదేశం కాదని చెప్పారు. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల దక్షిణాసియా దేశాలతో సంబంధాలకు చైనా పాకులాడుతున్నది. ఆయా దేశాలకు(మాల్దీవులు, శ్రీలంక, నేపాల్) భారీగా ఆర్థికసాయం అందజేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇకపై భారత్ తన దృష్టిని పశ్చిమ సరిహద్దు నుంచి ఉత్తరాది సరిహద్దుకు మార్చాలి అని పేర్కొన్నారు. భారత్ భూభాగంలోకి చొచ్చుకొస్తే సహించేది లేదని, సరిహద్దులో చైనా దాడులను సమర్థంగా తిప్పికొట్టే సామర్థ్యం భారత్‌కు ఉన్నదని చెప్పారు. కలహాల చైనా ఉత్తరాది ప్రాంతంలో దాడులను పెంచుతున్నదని, దీన్ని భారత్ అనుమతించబోదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే అంశంపై పాకిస్థాన్‌కు అమెరికా హెచ్చరికల గురించి మీడియా ప్రస్తావించగా.. ఈ హెచ్చరికలు పాక్‌పై ఏ మేరకు ప్రభావం చూపుతాయో వేచిచూస్తున్నామని రావత్ చెప్పారు.

158

More News

VIRAL NEWS