మోదీ బయోపిక్ చూడండి


Tue,April 16, 2019 01:41 AM

Watch Modi biopic fully this time SC tells ECI

-ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి
-ఈసీకి సూచించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ బయోపిక్ విడుదలపై విధించిన నిషేధాన్ని సమీక్షించాలని, ముందుగా సినిమాను చూసి తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీకి) సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు మోదీ బయోపిక్‌ను రిలీజ్ చేయొద్దని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం చీఫ్ జస్టిస్ రంజన్‌గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈసీ ఈ నెల 19 లోగా నిర్ణయాన్ని తెలియజే యాలన్నది. నివేదికను సీల్డ్‌కవర్‌లో కోర్టుకు అందజేయాలన్నది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. నిర్మాతల తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదిస్తూ కేవలం ఈ సినిమా ట్రైలర్‌ను చూసి ఈసీ నిషేధం విధించిందన్నారు. బుధ/గురువారాల్లో ఈసీ కోసం ప్రత్యేకంగా సినిమాను ప్రదర్శించేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారన్నారు.

93
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles