బాంబుల కంటే ఓటర్ ఐడీ ఎంతో శక్తిమంతం


Wed,April 24, 2019 02:48 AM

Voter ID much more powerful than IED

-కుంభమేళాలో స్నానంతో లభించే అంతటి పవిత్రత ఓటువేస్తే దక్కుతుంది
-గుజరాత్‌లో ఓటువేసిన ప్రధాని నరేంద్రమోదీ

అహ్మదాబాద్, ఏప్రిల్ 23: ఉగ్రవాదులు వినియోగించే ఐఈడీ (శక్తిమంతమైన పేలుడు పదార్థం) కంటే ఓటర్ గుర్తింపు కార్డు (ఓటర్ ఐడీ) ఎంతో శక్తిమంతమైందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభ మూడోదశ పోలింగ్ సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిసాన్ హైస్కూల్‌లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తర్వాత మీడియాతో ఇష్ఠాగోష్టిగా మాట్లాడారు. ఓటుహక్కు వినియోగంతో కుంభమేళాలో స్నానం చేసినంత పవిత్రత లభిస్తుందన్నారు. తొలిసారి ఓటేస్తున్న 21వ శతాబ్దిలో జన్మించిన యువతరం చురుగ్గా ఓటింగ్‌లో పాల్గొనడాన్ని స్వాగతించారు. ప్రధాని మోదీ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓపెన్ టాప్ జీప్‌లో పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. గాంధీనగర్ స్థానం నుంచి బరిలో నిలిచిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా.. ఆయనకి స్వాగతం పలికి, పోలింగ్‌కేంద్రానికి తోడ్కొని వెళ్లారు.

మమత ప్రధాని కలలు: మోదీ ఎద్దేవా

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని కావాలని కలలు కంటున్నారు. ఒకవేళ ఆ పదవిని వేలం వేస్తే.. చిట్‌ఫండ్ కుంభకోణాల్లో దోపిడీ చేసిన సొమ్ముతో ప్రధాని కావాలని ఆమె భావిస్తున్నారు అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్‌లోని అసాన్‌సోల్‌లో జరిగిన ఎన్నికల సభలో మోదీ మాట్లాడారు.

458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles