నాసా కాదు.. ఇస్రోనే!

Thu,December 5, 2019 02:27 AM

-విక్రమ్ జాడను ఆర్బిటార్ ఎన్నడో గుర్తించింది
-ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడి

చెన్నై: చంద్రుడిపై దిగే క్రమంలో ఆచూకీ లేకుండా పోయిన చం ద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ జాడను తాము గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేసిన ప్రకటనను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కే. శివన్ తోసిపుచ్చారు. విక్రమ్ జాడను తాము ఎన్నడో గుర్తించామన్నారు. విక్రమ్ జాడను మా ఆర్బిటార్ ఇదివరకే గుర్తించింది. ఈ విషయం మా వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచాం. కావాలంటే మీరు చూసుకోవచ్చు అని ఆయన స్పష్టంచేశారు. జాబిల్లిపై విక్రమ్ ఢీకొన్న ప్రాంతాన్ని, దాని శకలాలు విస్తరించిన ప్రదేశాన్ని గుర్తిస్తూ నాసా మంగళవారం పలు ఫొటోలను విడుదలచేస్తూ.. విక్రమ్ జాడను గుర్తించడంలో చెన్నై ఇంజనీర్ సుబ్రమణియన్ కీలకపాత్ర పోషించారని ప్రకటించిన విషయం తెలిసిందే. నాసా చిత్రాలను అణువణువు జల్లెడ పట్టిన సుబ్రమణియన్.. విక్రమ్ తొలి శకలాన్ని గుర్తించారని, ఆయనిచ్చిన ఆధారాలతో తమ బృందం ఇతర శకలాలను గుర్తించినట్లు తెలిపింది. విక్రమ్ క్రాష్‌ల్యాండింగ్ అయిన మూడు రోజుల తర్వాత ఇస్రో ట్వీట్ చేస్తూ.. విక్రమ్ ల్యాండర్ ప్రదేశాన్ని చంద్రయాన్-2 ఆర్బిటార్ గుర్తించింది. దానితో సంబంధాల పునరుద్ధరణకు అన్ని ప్రయత్నిస్తున్నాం అని పేర్కొంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన చంద్రయాన్-2ను జూలై 22న జీఎస్‌ఎల్వీ మాక్-3 రాకెట్ ద్వారా ప్రయోగించిన విషయం తెలిసిందే.

198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles