ఆఫ్రికాతో బంధానికి దృఢ పునాది

Thu,October 17, 2019 01:42 AM

- విజయవంతంగా ముగిసిన వెంకయ్యనాయుడు పర్యటన


సియెర్రా లియోన్‌ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: భారత్‌కు, ఆఫ్రికా దేశాలకు మధ్య స్నేహం బలోపేతమవుతున్నది. కామెరోస్‌, సియెర్రా లియోన్‌ దేశాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరు రోజుల పర్యటన మంగళవారంతో ముగిసింది. ఆ దేశాల్లో భారత ఉప రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా వ్యవసాయం, ఆహారశుద్ధి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల కల్పన తదితర రంగాలకు సంబంధించి ఆ దేశాలతో ఒప్పందాలు కుదిరాయి. ఐక్యరాజ్యసమితిలో భారత్‌, ఆఫ్రికాదేశాలు కలిసి ఒకే గొంతు వినిపించాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ పర్యటనలో కశ్మీర్‌ సహా పలు అంశాలపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. మరోవైపు ఆఫ్రికా దేశాల్లో భారత్‌ కొత్తగా 18 రాయబార కార్యాలయాలు నెలకొల్పాలని నిర్ణయించింది. సియెర్రా లియోన్‌లో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సౌజన్యంతో కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేయాలని భారత్‌ భావిస్తున్నది. కామెరోస్‌లో నౌకాయాన సంబంధ పరిశ్రమలపైనా దృష్టిసారించింది.

268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles