ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు?Mon,July 17, 2017 03:07 AM

-నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అధికారిక ప్రకటన

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ : ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున వెంకయ్యనాయుడు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తున్నది. సోమవారం సాయంత్రం జరుగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటేరియన్‌గా సుదీర్ఘ అనుభవం, రాజ్యసభను నిర్వహించడంలో సామర్థ్యం, వాగ్ధాటి.. ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ అధిష్ఠానం వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. మంగళవారం నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు కాబట్టి సోమవారం సాయంత్రంకల్లా ఎన్డీయే తమ అభ్యర్థి పేరును ప్రకటించాల్సి ఉంది.

venkaiahNaiduఅయితే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం జరుగకుండానే వెంకయ్యనాయుడి పేరు తెరపైకి రావడం సంచలనం రేకెత్తించింది. ఈ వార్తల అనంతరం వెంకయ్యనాయుడి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అధికారిక ప్రకటన వెలువడకముందే ఊహాగానాల మేరకు చర్చించడం సమంజసం కాదని మీడియాకు సూచించింది. రాష్ట్రపతి ఎన్నికల పోలిం గ్ పూర్తికాగానే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనున్నది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడనున్నది. మూడు రోజుల క్రితం తమతో సమావేశమైన అమిత్‌షాకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణాది వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు సూచించారు. కాగా, యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

607

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018