ఐఎస్ చెర నుంచి కేరళ మతగురువు విడుదలWed,September 13, 2017 02:19 AM

father-tom-uzhunnalil
న్యూఢిల్లీ : గతేడాది ఐఎస్ ఉగ్రవాదుల చేతికి బందీగా చిక్కిన కేరళకు చెందిన మతగురువు టామ్ ఉజుైన్లెన్ సురక్షితంగా బయటపడ్డారని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం వెల్లడించారు. టామ్‌ను కాపాడడంపై ఆమె ట్విట్టర్‌లో సంతోషం వ్యక్తంచేశారు. టామ్ మస్కట్ మీదుగా కేరళకు రానున్నారు. ఉగ్రవాదుల చెర నుంచి విడుదలవడంపై టామ్ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పారు. ఒమన్ పత్రిక సమన్వయంతో యెమన్ దళాలు టామ్‌ను సురక్షితంగా కాపాడగలిగాయి. కేరళలోని కొట్టాయంకు చెందిన టామ్.. 2010 నుంచి యెమెన్‌లోని ఆదెన్ అనే ప్రాంతంలో మిషనరీ చారిటీ చర్చిలో మతగురువుగా చేరిన ఫాదర్ టామ్‌ను గత ఏడాది మార్చి 4న ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

388

More News

VIRAL NEWS