వేగం ఘనం.. టిక్కెట్లు ప్రియం


Tue,February 12, 2019 12:40 AM

Vande Mataram Express Starts on 5th

- 15న ప్రారంభమయ్యే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తీరిది
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ 18) ప్రయాణ ధరలు ప్రయాణికుల పర్సులను ఖాళీ చేయనున్నాయి. ఢిల్లీ- వారణాసి మధ్య నడిచే ఈ రైలులో ఏసీ చైర్‌కార్ బోగీల్లో ప్రయాణించే వారి టిక్కెట్ ధర రూ.1,850, ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీ ప్రయాణ టిక్కెట్ ధర రూ. 3,250గా నిర్ణయించారు. ఇందులోనే కేటరింగ్ చార్జీలు కూడా కలిపేసినట్లు రైల్వేశాఖ అధికారి ఒకరు చెప్పారు. శతాబ్ది రైలులో చైర్ కార్ టిక్కెట్‌తో పోలిస్తే ఒకటిన్నర రెట్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ ధర 1.4 రెట్లు అధికం అని అధికార వర్గాలు తెలిపాయి. మేకిన్ ఇండియా ఇన్షియేటివ్‌లో భాగంగా రూపొందించిన తొలి ఇంజిన్ రహిత సెమీ స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 15న ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ మార్గంలో వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణించే వారి భోజనం, టీ, అల్పాహారం ధరలు కూడా విభిన్నమే. ఢిల్లీ- వారణాసి మధ్య ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలో ప్రయాణించే వారికి ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి రూ.399.. చైర్‌కార్ బోగీ ప్రయాణికుల నుంచి రూ.344 వసూలు చేస్తారు. ఈ రైలులో ప్రయాణించే వారు తప్పనిసరిగా భోజన బిల్లు చెల్లించాల్సిందే. కాకపోతే ఐఆర్సీటీసీ నుంచి భోజనం పొందితే చైర్‌కార్ బోగీ ప్రయాణికులు రూ.222, ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీ ప్రయాణికులు రూ.244 ఆదా చేయగలుగుతారు.

123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles