హేమామాలినికి వీరాభిమాని


Fri,August 17, 2018 07:37 AM

Vajpayee is the hero of the famous Bollywood actress Hema Malini

-గీతా ఔర్ సీతా సినిమాను 25 సార్లు చూసిన వాజపేయి
న్యూఢిల్లీ: వాజపేయి ప్రముఖ బాలీవుడ్ నటి, డ్రీమ్‌గర్ల్ హేమామాలినికి వీరాభిమాని. హేమామాలిని నటించిన సీతా ఔర్ గీతా సినిమా 19972లో విడుదలైంది. ఈ సినిమాను వాజపేయి 25 సార్లు చూశారట. హేమామాలి గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో వాజపేయిని మొదటిసారిగా కలిసినప్పటి అనుభవాన్ని నెమరువేసుకున్నారు. ఆయనను మొదటిసారిగా కలిసినప్పుడు నాతో మాట్లాడటానికి తటపటాయించారు. ఆయన ఎందుకు అలా ప్రవర్తించారంటూ మాతోపాటు అక్కడే ఉన్న ఓ మహిళను ప్రశ్నించా. దానికి ఆమె.. వాజపేయి మీ వీరాభిమాని. మిమ్మల్ని మొదటిసారిగా కలిశారు కాబట్టి కాస్త తడబడి ఉంటారని చెప్పింది అని హేమామాలిని గుర్తు చేసుకున్నారు. హేమామాలిని ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. 2003-2009 వరకు బీజేపీ తరఫున రాజ్యసభ్యురాలిగా పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.

భీమ్‌సేన్ జోషి, అంజద్ అలీఖాన్, హరిప్రసాద్ చౌరాసియా.. వాజపేయికి నచ్చిన క్లాసికల్ ఆర్టిస్టులు. లతా మంగేష్కర్, ముఖేష్, అర్డీ బర్మన్ గీతాలను ఎక్కువగా వినేవారు. సచిన్ దేవ్ బర్మన్ బాణీలను అమితంగా ఇష్టపడేవారు. నటుల్లో సంజీవ్‌కుమార్, సుచిత్రాసేన్ అంటే ఇష్టమని చెప్పేవారు. ఎవర్‌గ్రీన్ బాలీవుడ్ హిట్స్.. ఓ మేరీ మేరీ మాంజి, సున్ మేరీ బంధు రే, కబీ కబీ మేరా దిల్ సే వాజపేయికి నచ్చిన పాటలు. హిదీలో దేవదాస్, బందిని, తీస్రీ కసమ్, మౌసమ్, మమతా, ఆంధీ, ఇంగ్లిష్‌లో బ్రిడ్జ్ ఓవర్ ది రివర్ కవాయి, బార్న్ ఫ్రీ, గాంధీ తదితర చిత్రాలు ఇష్టమని చెప్పేవారు.

1965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS