ఉత్తరాఖండ్ సీఎంకు కునుకు లేకుండా చేస్తున్న వీధికుక్కలు!Sat,May 20, 2017 01:46 AM

uttarakhand
డెహ్రాడూన్, మే 19: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌కు వీధి కుక్కలు చుక్కలు చూపిస్తున్నాయి. రాత్రివేళ అరుపులతో ముఖ్యమంత్రికే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డెహ్రాడూన్‌లోని సీఎం క్యాంపు కార్యాలయ పరిసరాల్లో వీధి కుక్కల బెడదతో భద్రతా సిబ్బంది సైతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కుక్కల బెడదతో ప్రశాంతత కరువైందని, సంఖ్య పెరుగకుండా వాటికి తక్షణమే సంతాన నిరోధక ఇంజెక్షన్లు ఇప్పించాలని సీఎం కార్యాలయం అంతర్జాతీయ జంతు సంరక్షణ సంస్థ (హెచ్‌ఎస్‌ఐ)ను కోరింది. డెహ్రాడూన్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో రాత్రివేళ వీధుల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ బాటసారులను కరువడంతోపాటు, అరుపులతో నిద్రాభంగం కలిగిస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది.

205

More News

VIRAL NEWS