మత్స్యకారులకు దొరికిన రాకెట్‌ ఇంధన ట్యాంక్‌

Wed,December 4, 2019 02:52 AM

- స్వాధీనం చేసుకున్న ఇస్రో


పుదుచ్చేరి, డిసెంబర్‌ 3: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉప గ్రహ ప్రయోగానికి వినియోగించే పీఎస్‌ఎల్వీ రాకెట్‌ లాంచర్‌లో వాడిన ఇంధన ట్యాంక్‌ ఒకటి పుదుచ్చేరిలో లభ్యమైంది. సోమవారం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తమ వలకు చిక్కిన దీన్ని తీరానికి తీసుకొచ్చారు. ఈ విషయమై ఇస్రో అధికారులకు పుదుచ్చేరి ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దీంతో మంగళవారం పుదుచ్చేరికి చేరుకున్న శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రానికి చెందిన నలుగురు నిపుణుల బృందం ఆ ట్యాంక్‌ను తనిఖీ చేసిన తర్వాత దీన్ని స్పేస్‌ సెంటర్‌ గోదాంకు తరలించిందని పుదుచ్చేరి ప్రభుత్వ రెవెన్యూ విపత్తు యాజమాన్య విభాగం సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

1075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles