బస్తర్ తొలి మహిళా సీఆర్పీఎఫ్ అధికారిగా ఉషాకిరణ్Wed,January 11, 2017 02:33 AM

usha-kiran
రాయ్‌పూర్: గిరిజన మహిళలపై పోలీసులు లైంగికదాడులు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన జిల్లా బస్తర్‌కు సీఆర్పీఎఫ్ తొలిమహిళా అధికారిగా ఉషా కిరణ్‌ను ప్రభుత్వం నియమించింది. సీఆర్పీఎఫ్ 80వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఆమెకు పోస్టింగ్ ఇచ్చింది. 2015 అక్టోబర్‌లో రాష్ట్రపోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఐదురోజుల ఆపరేషన్ సందర్భంగా 16 మంది గిరిజన మహిళలపై లైంగికదాడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. మూడురోజుల క్రితం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) విచారణకు ఆదేశించిన కథనాలు వార్తాపత్రికల్లో వచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌కు చెందిన, ట్రిఫుల్ జంప్ అథ్లెట్ అయిన ఉషా కిరణ్ (27)ను ప్రభుత్వం ఈ పోస్టులో నియమించింది. కిరణ్ తాత, తండ్రి సీఆర్పీఎఫ్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. అభివృద్ధి లేక మావోయిస్టుల హింస పెరుగడం, అమాయక గిరిజనులు ఉండటం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడం వల్ల తాను ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నట్టు ఆమె తెలిపారు. కొండగావ్‌లో మరో మహిళా అధికారి అర్చనా గౌర్ కూడా విధులు నిర్వహిస్తున్నారు.

2221
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS