ఊర్మిళ రోడ్‌షోలో ఘర్షణ!


Tue,April 16, 2019 11:12 AM

Urmila Matondkar Gets Police Cover After Congress BJP Clash in Mumbai

-రక్షణ కల్పించాలని కోరిన కాంగ్రెస్ నేత.. అంగీకరించిన పోలీసులు
-ముంబైలోని బోరివలి రైల్వేస్టేషన్ వద్ద సోమవారం ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊర్మిళ మతోండ్కర్
ముంబై, ఏప్రిల్ 15: తనకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని కోరిన నార్త్ ముంబై పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళ మతోండ్కర్‌కు పోలీసులు రక్షణ కల్పించడానికి అంగీకరించారు. సోమవారం బోరివలి రైల్వేస్టేషన్ సమీపంలో ఊర్మిళ రోడ్‌షో నిర్వహిస్తుండగా బీజేపీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న వారికి, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. రోడ్‌షోలో కొందరు మోదీ.. మోదీ.. అంటూ నినాదాలుచేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజేపీ కార్యకర్తలు అభ్యంతరకర రీతిలో డ్యాన్స్‌చేస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించారని, మహిళలను భయపెట్టేందుకు ప్రయత్నించారని ఊర్మిళ పేర్కొన్నారు. భయాందోళనలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నదని ఆందోళనవ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలను బీజేపీ ఉల్లంఘిస్తున్నదని, కోడ్ ఉల్లంఘించిన వారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. కాగా.. ఈ ఘటనపై డీసీపీ సంగ్రమ్‌సింహ్ నిశందర్ మాట్లాడుతూ.. ఊర్మిళ నుంచి మాకు ఫిర్యాదు అందింది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆమెకు రక్షణ కల్పిస్తాం. ఐతే, ఊర్మిళ చెప్పినట్టు రోడ్‌షోలో మోదీ అని నినాదాలు చేసిన వాళ్ళు బీజేపీ కార్యకర్తలన్న ఆధారాలు లేవు. వాళ్లు ప్రయాణికులు అని తెలిపారు. నార్త్ ముంబై నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ గోపాల్‌షెట్టి పోటీచేస్తున్నారు. ఏప్రిల్ 29న ఇక్కడ పోలింగ్ జరుగనున్నది.

155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles