ప్రశాంత్ కిశోర్‌ను తీసుకొస్తే 5 లక్షల నజరానా!

Tue,March 21, 2017 02:27 AM

-యూపీ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట వెలిసిన పోస్టర్

PRASHANTH
లక్నో, మార్చి 20: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్‌ను పార్టీ కార్యకర్తల వద్దకు తీసుకొస్తే రూ.5 లక్షల నజరానా అందిస్తామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట పోస్టర్ వెలిసింది. దీనిని యూపీ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి రాజేశ్ సింగ్ ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్ చూసిన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ వెంటనే తొలగించాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. ఈ చర్యను నిరసిస్తూ రాజేశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్‌బబ్బర్ ప్రకటించారు. అయితే దీనిని రాజేశ్‌సింగ్ తోసిపుచ్చారు. గతేడాది నుంచి మేమంతా ఎలాంటి ప్రశ్నలు వేయకుండా పార్టీ కోసం పనిచేశాం, ఎలాంటి సందేహాలు వెలిబుచ్చకుండా ప్రశాంత్ కిశోర్ చెప్పినట్టు చేశాం, ఇలా చేయడం ప్రతిపక్షానికి మేలు చేసినైట్లెందని మేం భావిస్తున్నాం అని రాజేశ్ సింగ్ అన్నారు. వీటన్నింటికి తమకు సమాధానాలు కావాలని ఆయన డిమాండ్ చేశారు.

473

More News

మరిన్ని వార్తలు...