వంటవాడే ఐఎస్‌ఐ ఏజెంట్


Fri,May 25, 2018 01:08 AM

Up Ats Arrested Isi Agent From Uttarakhand

గతంలో పాక్‌లో భారత రాయబారి ఇంట్లో పని
ISI-Agent-Ramesh-singh
లక్నో/పిథోరాగఢ్, మే 24: ఓ ఐఎస్‌ఐ ఏజెంట్‌ను ఉత్తర్‌ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) అరెస్టు చేసింది. నిందితుడు గతంలో పాకిస్థాన్‌లోని భారత రాయబారి ఇంట్లో పనిచేసినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిథోరాగఢ్ జిల్లా దిడిహట్ ప్రాంతానికి చెందిన రమేశ్ సింగ్ కన్యాల్ 2015 నుంచి 2017 వరకు పాకిస్థాన్‌లోని భారత రాయబారి ఇంట్లో వంట మనిషిగా పనిచేశాడు. తర్వాత అతడు పిథోరాగఢ్‌కు వచ్చాడు. అతడి కదలికలపై అనుమానం కలిగిన ఏటీఎస్ అధికారులు దిడిహట్ ప్రాంతంలో అరెస్టు చేశారు. నిందితుడి వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పిథోరాగఢ్ ఎస్పీ రామచంద్రా రాజ్‌గురు మాట్లాడుతూ రమేశ్‌సింగ్ కన్యాల్ పాకిస్థాన్‌లో ఉన్నప్పుడు భారత్‌కు చెందిన రహస్య సమాచారాన్ని పాక్ ఇంటెలిజెన్స్‌కు చేరవేసేవాడని తెలిపారు. పాక్ లోని భారత రాయబారికి చెందిన ల్యాప్‌టాప్, ఫోన్‌లోని సమాచారాన్ని తస్కరించాడని చెప్పారు. డబ్బుల కోసమే ఇలా చేసినట్లు తెలుస్తున్నదని, దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడుతాయని పేర్కొన్నారు.

648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles