ఎయిమ్స్ కోర్టులో ఉన్నావ్ విచారణ ప్రారంభం


Thu,September 12, 2019 02:15 AM

Unnao rape case Judge at AIIMS to record victims statement accused Kuldeep Sengar also present

- బాధితురాలి వాంగ్మూలం సేకరించిన ప్రత్యేక జడ్జి
- ఇద్దరు నిందితుల హాజరు.. విచారణ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరణ


న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలోని జయప్రకాశ్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టులో ఉన్నావ్ లైంగిక దాడి చేసు విచారణ ప్రారంభమైంది. బుధవారం ప్రత్యేక జడ్జి ధర్మేశ్ శర్మ.. బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెన్‌గర్‌ను, మరో నిందితుడు సాక్షి సింగ్‌ను సైతం హాజరుపరిచారు. విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో కెమెరాల్లో చిత్రీకరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఉన్నావ్ కేసు విచారణను 45 రోజుల్లోగా పూర్తిచేయాలంటూ విచారణ బాధ్యతను జిల్లా జడ్జి జస్టిస్ ధర్మేశ్‌శర్మకు అప్పగించిన సంగతి తెలిసిందే. జూలై 28న కారు ప్రమాదంలో గాయపడిన బాధితురాలు ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె కోర్టు వరకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎయిమ్స్‌లోనే ప్రత్యేక కోర్టు హాల్ ఏర్పాటుచేశారు.

127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles