పెను సవాలుగా ప్లాస్టిక్‌

Sat,November 23, 2019 03:20 AM

- దేశంలో రోజుకు 26వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తి
- అందులో సేకరిస్తున్నది మూడింట రెండొంతులే: కేంద్ర మంత్రి జవదేకర్‌

న్యూఢిల్లీ: దేశంలో రోజూ సుమారు 26వేల టన్నుల ప్యాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో మూడింట రెండొంతుల ప్లాస్టిక్‌ను మాత్రమే సేకరిస్తున్నామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. మిగిలిన ప్లాస్టిక్‌ వ్యర్థాలన్నీ కాలువలు, బీచ్‌లు, రోడ్లు వంటి ప్రాంతాల్లో పేరుకుపోతున్నాయని తెలిపారు. ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) రంగంలో ప్లాస్టిక్‌ వినియోగం పెరిగిన కారణంగా డిమాం డ్‌ పెరిగిందని, ఇది పరోక్షంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణకు సవాల్‌గా మారిందని వివరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మన్నిక, బలం, తక్కువ ధర కావడంతో వివిధ పరిశ్రమలు ప్యాకేజింగ్‌కు ప్లాస్టిక్‌నే అధికంగా వాడుతున్నాయని తెలిపారు. ప్లాస్టిక్‌ ధర తక్కువగా ఉండడంతో దానికి ప్రత్యామ్నాయం కనుగొనడం సవాల్‌గా మారిందని మరో ప్రశ్నకు జవాబిచ్చారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్లాస్టిక్‌ను భూమిలో కలిసిపోయే చేసే సాంకేతికతను (బయోడీగ్రేడబుల్‌) అభివృద్ధి చేసేందుకు సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసిందని చెప్పారు. స్వచ్ఛభారత్‌ రెండోవిడుత ఉద్యమంలో భాగంగా 2022 నాటికి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు చరమగీతం పాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్లాస్టిక్‌, ఘన వ్యర్థాల నిర్వహణపై చర్చించేందుకు అన్ని రాష్ర్టాల పర్యావరణ శాఖ మంత్రులతో వచ్చే నెలలో సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో ఏటా 30 కోట్ల సెల్‌ఫోన్లు పనికిరాకుండా పోతున్నాయని, వాటిని రీసైక్లింగ్‌ చేయడం సవాల్‌గా మారిందని పేర్కొన్నారు.

బీజింగ్‌ కంటే ముందుగానే..

వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు చైనా రాజధాని బీజింగ్‌కు 15 ఏండ్లు పట్టిందని, తాము అంతకంటే తక్కువ సమయంలోనే ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరుస్తామని జవదేకర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. సమస్యను అధిగమించేందుకు ప్రజా ఉద్యమం అవసరమని చెప్పారు. 2030 నాటికి దేశ విద్యుత్‌ సామర్థ్యంలో 40 శాతం పునరుత్పాదక వనరుల నుంచే ఉత్పత్తి చేస్తామన్నారు. ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తూ సెప్టెంబర్‌ 18న జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ఈ-సిగరెట్ల నిషేధ బిల్లు-2019ను ప్రవేశపెట్టింది. మీరేమన్నా మంత్రా?

ఢిల్లీలో నల్లా నీటి నాణ్యత విషయంలో రాజ్యసభలో ఆప్‌, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. కలుషిత నీటిపై బీజేపీ నేత విజయ్‌ గోయల్‌ చర్చ ప్రారంభించగా, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూర్చోవా లని చెప్పినా సంజయ్‌ వినకపోవడంతో ‘సరిచేయడానికి మీరేమైనా మంత్రా’ అంటూ వెంకయ్య ప్రశ్నించారు. కొన్ని రైళ్లలోని కమర్షియల్‌, ఆన్‌బోర్డ్‌ సేవలను ప్రైవేట్‌కు అప్పగించాలని భావిస్తున్నట్టు రైల్వేమంత్రిత్వ శాఖ రాజ్యసభకు సమాచారం ఇచ్చింది. పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించమని చెప్పారు. కాగా, రాజ్యసభ మార్షల్స్‌ యూనిఫాంపై ప్రభుత్వం వెనక్కితగ్గినట్ట్టు సమాచారం.

430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles