రైళ్లల్లో నో మసాజ్


Sun,June 16, 2019 01:14 AM

Under fire Western Railways withdraws massage services proposal on trains

- రైల్వే శాఖ ప్రతిపాదన ఉపసంహరణ

న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైళ్లల్లోనే మసాజ్ చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు రైల్వే శాఖ శనివారం తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి మొదలయ్యే 39 రైళ్లల్లో మసాజ్ సేవలను అందుబాటులోకి తేవాలని కొందరు అధికారులు ప్రతిపాదించారని, తల, మెడ, కాళ్లకు మసాజ్ చేయించుకుంటే, ప్రయాణికులు డబ్బు లు చెల్లించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఈ ప్రతిపాదనపై ప్రయాణికులతోపాటు ప్రజా ప్రతినిధుల నుంచీ తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, రైళ్లల్లో మహిళల ముందు మసాజ్ చేయించుకోవడం భారత సంస్కృతికి విరుద్ధమని వాళ్లు చెప్పారని తెలిపింది. దీంతో ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles