డీడీఎస్‌కు ఐరాస అవార్డు


Wed,June 12, 2019 02:05 AM

UN fetes six Telangana women green champs

-పర్యావరణ పరిరక్షణకు పాల్పడుతున్నందుకు గుర్తింపు
ఐక్యరాజ్యసమితి, జూన్ 11: తెలంగాణకు చెందిన ప్ర ఖ్యాత స్వచ్ఛంద సంస్థ డెక్కన్ డెవలప్‌మెంట్ సొ సైటీ (డీడీఎస్)కు ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి అవా ర్డు లభించింది. ప్రతికూల పర్యావరణ మార్పులను అరికట్టే పరిష్కారాలను సూచించే పలు సంస్థలకు గుర్తింపునిచ్చేందుకు ఐరాసలోని ఈక్వేటర్ ఇనిషియేటివ్ ద్వైవార్షికంగా ఈ అవార్డును అందజేస్తుంది. ఈ ఏడాది అవార్డు కోసం ఈక్వేటర్ ఇనిషియేటివ్ 22 సంస్థలను ఎంపిక చేయగా, వాటిలో జహీరాబాద్‌కు చెందిన డీడీఎస్ కూడా ఉంది. ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) పరిధిలో పనిచేసే ఈక్వేటర్ ఇనిషియేటివ్ డీడీఎస్‌ను ఈక్వేటర్ ప్రైజ్ 2019కు ఎంపిక చేసింది. జహీరాబాద్ ప్రాంతంలో దళిత, గిరిజన మహిళలకు సాధికారత కల్పించేందుకు, పర్యావరణ అనుకూల భూ వినియోగాన్ని ప్రో త్సహించేందుకు, ఆహార భద్రతను సాధించేందుకు గాను పునరుత్పత్తి వ్యవసాయ విధానాలు, సా మాజిక విత్తన బ్యాంకులను డీడీఎస్ ప్రోత్సహిస్తున్నది.

డీడీఎస్‌కు పూ ర్తిగా మహిళలే నేతృత్వం వహిస్తున్నారు. గత 25 ఏండ్లుగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సుమారు 75 గ్రామాల్లో క్షేత్రస్థాయిలో వివిధ మహిళా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. ఈ సంస్థలో సమాజంలోని అట్టడుగువర్గాలు, పేద దళితులు సుమారు 5000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని ఐరాస పేర్కొంది. ఈక్వేటర్ అవార్డుకు కెన్యా, ఇండొనేషియా, హవాయి, బ్రెజిల్ తదితర దేశాలకు చెందిన సంస్థలు కూడా ఎంపికయ్యాయి. ఈ అవార్డు కోసం 127 దేశాల నుంచి 847 నామినేషన్లు వచ్చాయి.

141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles