Telangana Intermediate 1st & 2nd Year Results 2019

కుప్పకూలిన భవనం


Wed,March 20, 2019 04:00 AM

Two killed as building collapses in Dharwad

-ఇద్దరు మృతి
-ప్రాణాలతో బయటపడిన 28మంది
-శిథిలాల కింద పలువురు
-కర్ణాటకలోని ధార్వాడ్‌లో దుర్ఘటన

బెంగళూరు, మార్చి 19: ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం మంగళవారం కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది ఆ భవన శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిలో ఎక్కువ మంది ఉత్తర భారత దేశానికి చెందిన వలస కూలీలేనని స్థానికులు చెప్తున్నారు. ధార్వాడ్‌లోని కుమరేశ్వరనగర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఈ భవనానికి యజమాని అని తెలుస్తున్నది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే 10 అంబులెన్సులు, మరో 5 అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను ప్రారంభించాయి. ఇప్పటివరకు దాదాపు 28 మంది కార్మికులను శిథిలాల నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇంకా అనేకమంది ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్టు స్థానికులు చెప్తుండగా.. 30 నుంచి 40 మంది చిక్కుకుని ఉండవచ్చని ఓ పోలీస్ అధికారి తెలిపారు.

రెండేండ్ల నుంచి నిర్మిస్తున్న ఈ భవనంలో ప్రస్తుతం మూడో అంతస్తు పనులు జరుగుతున్నాయి. తొలి రెండంతస్తులు గతంలోనే పూర్తవడంతో వాటిలో దాదాపు 60 దుకాణాలు నడుస్తున్నాయి. భవనం కూలినప్పుడు ఆ దుకాణాల్లో దాదాపు 150 మంది ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు. ప్రత్యేక విమానంలో ధార్వాడ్‌కు మరింత మంది సహాయ సిబ్బందిని, నిపుణులను పంపడంతోపాటు ఆ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించానని ఆయన తెలిపారు. కాగా, ఈ భవన భాగస్వాముల్లో తన బంధువు ఒకరు ఉన్నారని కర్ణాటక మాజీ మంత్రి, స్థానిక కాంగ్రెస్ నాయకుడు వినయ్ కులకర్ణి తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రమేయం ఉన్నవారు ఎవరైనా కఠిన చర్య ఎదుర్కోవాల్సిందేనని ఆయన అన్నారు. ఈ భవనానికి నాలుగు అంతస్తుల బరువును మోయగలిగే సామర్థ్యం లేదని, ఆ భవన నిర్మాణానికి నాసిరకం సామగ్రిని ఉపయోగించారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

1313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles