వ్యవసాయానికే నెటిజన్ల ఓటుWed,January 11, 2017 12:45 AM

ఆర్థికశాఖ పిలుపునకు ట్విటర్‌లో స్పందన
న్యూఢిల్లీ, జనవరి 10: ఈసారి కేంద్ర బడ్జెట్ రూపు మారనున్నది. గతానికి భిన్నంగా ఉండనున్నది. ఏటా ఫిబ్రవరి చివరి తేదీన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేవారు. కానీ, ఈసారి 1వ తేదీనే ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం పద్దులు ఇక కనిపించవు. మొత్తం ఆదాయాన్ని రెవెన్యూగా, ఖర్చును పెట్టుబడి ఖాతాల్లో చూపనున్నారు. వీటితోపాటు మరో భారీ మార్పు జరుగనుంది. 1921వ సంవత్సరం నుంచి వేరుగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ ఇక మీదట ఉండదు. సాధారణ బడ్జెట్‌లో విలీనం కానుంది. ఈక్రమంలో బడ్జెట్‌లో ఏ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో నెటిజన్ల నుంచి అభిప్రాయాలతోపాటు ఓటు వేయమని కోరింది. వచ్చే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఏమి ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఏఏ రంగాలకు కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు? ఏ రంగం లో ఎక్కువగా ఉద్యోగాల కల్పన జరుగాలనుకుంటున్నారు? అభిప్రాయాలతోపాటు ఓటు వేయం డి అంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈనెల మొదట్లో ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 2017-18 బడ్జెట్‌కు మూడు వారాల ముందు చేపట్టిన ఈ మధ్యంతర సర్వేలో వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎక్కువ మంది నెటిజన్లు కోరుకున్నారు. 51శాతం మంది ఓటుతో మద్దతు తెలిపారు. యువత మీద దృష్టి సారించాలని 31శాతం, వికలాంగుల సంక్షేమం వైపు 10శాతం, మహిళలూ చిన్నపిల్లల వైపు 8శాతం మంది మొగ్గు చూపారు. మరో మూడు రోజులపాటు ఈ ట్విటర్ పోల్‌లో ఓటు వేయవచ్చు.

232
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS