కిన్‌టాంపూ జలపాతంలో 20మంది విద్యార్థుల జల సమాధి

Tue,March 21, 2017 02:30 AM

water అక్రా, మార్చి 20: ఘనా దేశంలోని ప్రఖ్యాత కిన్‌టాంపూ జలపాతంలో ఓ భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో అక్కడున్న 20 మంది విద్యార్థులు చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. వెంచి ఉన్నత పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు, పర్యాటకులు సోమవారం కిన్‌టాంపూ జలపాతానికి వచ్చారు. ఒక్కసారిగా భారీగా ఈదురుగాలి వీయడంతో పక్కనే ఉన్న భారీ వృక్షం విద్యార్థులపై పడిపోయింది. అత్యవసర సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పడిపోయిన వృక్షాన్ని రంపంతో కోసి తొలగిస్తున్నారని ఘనాకు చెందిన స్టార్ న్యూస్ పేర్కొన్నది. ఈ ప్రమాదంలో గాయపడింది ఎక్కువమంది పాఠశాలకు చెందిన విద్యార్థులని, మరికొందరు పర్యాటకులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. వృక్షం నెలకొరిగిన సమయంలో 18 మంది చనిపోయారని, మరో ఇద్దరు దవాఖానలో మృతిచెందారని ఘనా జాతీయ అగ్నిమాపకశాఖ అధికార ప్రతినిధి ప్రిన్స్ బిల్లీ తెలిపారు. మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

552

More News

మరిన్ని వార్తలు...