టీటీడీని భ్రష్ఠు పట్టిస్తున్నారుWed,May 16, 2018 01:59 AM

ramana
ఏపీ ప్రభుత్వం, అధికారులపై ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఫైర్
తిరుమల, నమస్తేతెలంగాణ: తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విస్తరణ పేరుతో నాశనం చేస్తున్నారని, స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్ఠు పట్టిస్తున్నారని టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఆరోపించారు. మంగళవారం చెన్నైలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారులపై నిప్పులు చెరిగారు. అనాదిగా వస్తున్న అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయడం శాస్త్ర విరుద్ధమన్నారు. స్వామివారిని తాకే అధికారం ఆగమ అర్చకులకే చెల్లుతుందని తెలిపారు. స్వామివారిని తాకడమే మహాపుణ్యంగా భావించి ఇంతకాలం అవమానాలు ఎదుర్కొన్నామని చెప్పారు. స్వామివారి గురించి, ఆలయం గురించి తెలియని అధికారులను నియమించి ప్రభుత్వం పెద్దతప్పు చేసిందని మండిపడ్డారు. టీటీడీపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవించినట్టు తెలిపారు.

326

More News

VIRAL NEWS