రాజస్థాన్ కాంగ్రెస్‌లో బయటపడ్డ విభేదాలు


Thu,September 12, 2019 02:42 AM

Trouble Brews in Rajasthan Congress Sachin Pilot Slams CM Ashok Gehlot on Law And Order

- శాంతిభద్రతలపై డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ అసంతృప్తి

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఇటీవల జరిగిన ఘటనలు పునరావృతం కాకూడదు. దౌల్‌పూర్, అల్వార్ ఘటనలు ఆందోళన కలిగించే అంశాలు అని రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పేర్కొన్నారు. హోంశాఖను రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పైలట్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలో మతపరమైన ఘటనలు జరిగాయి. జైళ్లు బద్దలు కొట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వం ముఖ్యమైన విధుల్లో ఒకటి. రాష్ట్రంలోని నా కూతుళ్లంతా సురక్షితంగా ఉండాలి అని పైలట్ వ్యాఖ్యానించారు. ఈ నెల ఆరోతేదీన అల్వార్ జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్ లాకప్‌లో ఉన్న పేరుపొందిన నేరగాడిని కొందరు వ్యక్తులు వచ్చి పోలీస్ స్టేషన్‌పై కాల్పులు జరిపి విడిపించుకుపోయారు.

167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles