నిండు గర్భిణి నరకయాతన


Sun,February 10, 2019 02:49 AM

Travel 40 km in the forest

-అడవిలో 40 కిలోమీటర్ల ప్రయాణం
-అయినా తల్లి కడుపులోనే ప్రాణం విడిచిన బిడ్డ

చర్ల: ఛత్తీస్‌గఢ్ దండకారణ్య సమీప గ్రామాల్లోని ఆదివాసీలకు నేటికీ సరైన వైద్యం అందడం లేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బట్టిగూడెం గ్రామానికి చెందిన పొడి యం ఉంగి మూడురోజులుగా ప్రసవ వేదన అనుభవిస్తున్నది. ప్రసవం కష్టం కావడంతో కుటుంబ సభ్యులు అటవీ మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు బయల్దేరి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి శనివా రం తెల్లవారుజామున ట్రాక్టర్‌లో తీసుకొ చ్చారు. అక్కడ ఉంగిని పరిశీలించిన పీహెచ్‌సీ వైద్యులు కడుపులో బిడ్డ మృతి చెందినట్టు నిర్ధారించారు. తల్లిని కాపాడేందుకు మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

వైద్యం అందుబాటులో లేదు..


నా భార్య మూడు రోజులుగా పురిటినొప్పులతో బాధపడుతున్నది. దగ్గరలో దవాఖానలేదు. చర్ల దవాఖానకు ట్రాక్టర్‌లో తీసుకొచ్చాం. డాక్టర్లు చూసి కడుపులో బిడ్డ ప్రాణంలేదని చెప్పారు. భద్రాచలం తీసుకుపొమ్మన్నారు. మాకు అందుబాటులో వైద్యం లేనందున ఎంతో బాధపడుతున్నం. అడివిల నుంచి ఎంతో కష్టపడి వచ్చినా గర్భంలోనే బిడ్డను పోగొట్టుకొవాల్సి వచ్చింది.
-పొడియం రమేశ్, బట్టిగూడెం, ఛత్తీస్‌గఢ్

301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles