నేడు ప్రాంతీయ విమానయానంపై ఎంవోయూ

Wed,January 11, 2017 12:53 AM

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: ప్రాంతీయ విమానయాన అనుసంధానం పథకానికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖతో తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం తరఫున మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు భేటీ అవుతారు. అనంతరం 11.30గంటలకు ఈ ఒప్పందంపై సంతకాలు జరుగనున్నాయి.
-కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి అనంత్ గీతేతో కూడా కేటీఆర్ మధ్యాహ్నం 12గంటలకు భేటీ అవుతారు. ఆయన వెంట మంత్రి జోగు రామన్న ఉంటారు. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన సిమెంటు ఫ్యాక్టరీని తెరిపించడానికి అవసరమైన చర్యలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహాయ సహకారాలపై చర్చ జరుగనుంది.
-మధ్యాహ్నం 2.30గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసాతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. రాష్ర్టానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై సమావేశంలో వివరిస్తారు.
-సాయంత్రం 5.30గంటలకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. సిరిసిల్లలో మెగా టెక్స్‌టైల్ పార్కుతోపాటు వివిధ పథకాల కింద కేంద్ర నిధులతో పవర్‌లూమ్ యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ రూపంలో సాయం చేయాలని కోరే అవకాశం ఉంది.

190

More News

మరిన్ని వార్తలు...