HomeNational News

నేపాల్ సరిహద్దులో హనీప్రీత్ ఇన్సాన్?

Published: Wed,September 13, 2017 02:40 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

పోలీసుల విస్తృత తనిఖీలు
honey
షాజహన్‌పూర్, సెప్టెంబర్ 12: డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ ముఖ్య అనుచరురాలు, దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆమె నేపాల్‌కు పారిపోయి ఉంటారని హర్యానా పోలీసులకు సమాచారం రావడంతో సరిహద్దులో గస్తీ పెంచారు. పోలీసులతోపాటు సశస్త్రసీమబల్ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. గుర్మీత్‌కు శిక్షపడిన తర్వాత ఆయనను తప్పించేందుకు హనీప్రీత్ కుట్ర పన్నారని హర్యానా పోలీసులు ఈ నెల 1న లుక్‌ఔట్ నోటీసు జారీచేశారు. తర్వాత ఆమె ఫొటోలను నేపాల్ సరిహద్దు పోలీస్ స్టేషన్లలో అతికించారు. నేపాల్ సరిహద్దులో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్, మహారాజ్‌గంజ్, లఖీంపూర్ ఖేరీ, బాహ్రెయిచ్, ఫిలిబిత్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

481

More News