శ్రీనగర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం


Thu,October 18, 2018 01:31 AM

Three militants killed in encounter in Srinagar

ఒక కానిస్టేబుల్ మృతి, మరో ఐదుగురు పోలీసులకు గాయాలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో బుధవారం పోలీసు బలగాలు-ఉగ్రవాదుల మధ్య భీకరకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక కానిస్టేబుల్ మరణించగా, ఐదుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఒక ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో శ్రీనగర్ పాతనగరంలోని ఫాతే కాదల్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇండ్లను జల్లెడ పడుతుండగా ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కివున్నట్టు గుర్తించారు. లొంగిపోవాలని హెచ్చరించిన పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. మృతుల్లో లష్కరే తోయిబా సంస్థ కమాండర్ మెహ్రుద్దీన్ బంగ్రూ ఉన్నాడు.

338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles