చదువుకోండిగానీ.. ఉద్యోగాలడుగొద్దుThu,October 19, 2017 02:35 AM

-భారత్‌లో మహిళల పట్ల వివక్ష
-ఐరాస నివేదికలో వెల్లడి
Girl-students
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: లింగ అసమానతల ప్రపంచంలో చదువు, ఉద్యోగం, పునరుత్పత్తి హక్కుల విషయంలో మహిళలు వివక్షకు గురవుతున్నారు. ఈ విషయంలో భారత్ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి సంస్థ (యూఎన్‌ఎఫ్‌పీఏ) తాజాగా విడుదల చేసిన 2017 నివేదిక వెల్లడించింది. అందులోని ముఖ్యాంశాలు..

చదువులో ముందంజ సరేకానీ..

మహిళలకు విశ్వవిద్యాలయ విద్య విషయంలో ప్రపంచ ధోరణికి అనుగుణంగా భారత్ కూడా ఇతోధికంగా అవకాశాలు కల్పిస్తున్నది. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని చదువులో మహిళలు ముందుకు సాగుతున్నారు. కానీ అరకొరగా ఉన్న ఉద్యోగాల విషయంలో మాత్రం ఈ ఉదారత కొరవడుతున్నది. భారత్‌లో జరిపిన సర్వేలో కేవలం 24-25 శాతం మంది మాత్రమే కొరత సమయంలోనూ మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడ్డారు. జపాన్‌లో మరీదారుణంగా 20 శాతం మాత్రమే సమర్థించారు. స్వీడన్‌లో గరిష్ఠంగా మహిళల చదువుకు 98-99 శాతం, మహిళల ఉద్యోగాలకు 98 శాతం ఓట్లు పడ్డాయి.

ఎడతెగని అసమానతలు, బాల్యవివాహాలు

సామాజిక, లింగ అసమానతలు, బాల్యవివాహాల సూచికలో భారత్ సరిగ్గా మధ్యస్థాయిలో ఉంది. భారత్‌లో 27 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలలోపే పెండ్లిళ్లు జరుగుతున్నాయి. ప్రపంచ సగటు 28 శాతం కావడం గమనార్హం. దక్షిణాసియాలో భూటాన్ ఈ విషయంలో అందరికన్నా నయంగా ఉంది.

వేతన అసమానతలు

దక్షిణాసియాలో భారత్, పాకిస్థాన్‌లలో మాత్రమే స్త్రీపురుషుల మధ్య వేతన అసమానతలు అధికంగా ఉన్నాయి. నేపాల్, భూటాన్ ఈ రెండు దేశాల కన్నా మెరుగ్గా ఉన్నాయి. 90 దేశాల పట్టికలో భారత్, పాకిస్థాన్ తర్వాతి స్థానంలో జోర్డాన్ ఉన్నది.

చట్టాల్లో సమానత ఫరవాలేదు

కుటుంబ, శ్రామిక, శిక్షాస్మృతి చట్టాల్లో సమానత్వం విషయంలో భారత్ పరిస్థితి చాలా దేశాలకంటే మెరుగ్గా ఉంది. కేవలం 15 అంశాల్లో మాత్రమే స్త్రీపురుషులకు తేడాలున్నాయి. దక్షిణాసియాకు సంబంధించి ఆఫ్ఘనిస్థాన్‌లో అత్యధికంగా 40 అంశాల్లో తేడాలున్నాయి.
women-employee

మహిళల నిరుద్యోగంతో ఆదాయం నష్టం

మహిళలకు ఉపాధి నిరాకరించే వ్యవస్థ వల్ల సామాజిక సమస్యలే కాకుండా ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయని ఐరాస నివేదిక తెలిపింది. భారత్‌లో మొత్తం మహిళలు అందరు ఉద్యోగాల్లో చేరితే 2025 నాటికి 70 వేల కోట్ల డాలర్ల (రూ.44 లక్షల కోట్లు) అదనపు ఉత్పత్తి లేదా జీడీపీలో అదనంగా 1.4 పర్సెంటేజీ పాయింట్లు సమకూరుతాయి.

577

More News

VIRAL NEWS