లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి


Fri,August 23, 2019 02:58 AM

Three elephants killed after being hit by truck in Odisha

ఒడిశా: ఒడిశాలోని కియెంఝర్ జిల్లాలో గురువారం రాత్రి లారీ ఢీకొని మూడు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఘటగావ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బలిజోడి ప్రాంతంలో రోడ్డు (ఎన్‌హెచ్-20) దాటుతున్న ఏనుగుల గుంపును ఇనుప ఖనిజం లోడులారీ వేకువజామున మూడుగంటల ప్రాంతంలో వేగంగావెళ్తూ ఢీకొట్టడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. పదహారేండ్ల ఆడ ఏనుగు, ఏడాది వయసున్న ఏనుగు గున్న అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన మరో ఆడ ఏనుగు చికిత్స పొందుతూ మరణించిందని ఘటగావ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ అశోక్‌కుమార్ నాయక్ తెలిపారు.

609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles