ఫకీర్ ఇక జోలె పట్టుకొని తిరుగాల్సిందే!


Thu,May 16, 2019 01:29 AM

This Is What Shatrugha- Sinha Would Say If PM Modi Walked Up To Him

- మోదీని ఉద్దేశించి శత్రుఘ్నసిన్హా వ్యాఖ్య

పాట్నా: గతంలో ప్రధాని మోదీ చెప్పింది నిజమేనని, ఫకీర్ అయిన ఆయన జోలె పట్టుకొని వెళ్లిపోవాల్సిన సమయం వచ్చిందని బీజేపీ మాజీ నేత, బీహార్‌లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి శత్రుఘ్నసిన్హా చెప్పారు. 2016లో పెద్దనోట్లను రద్దు చేశాక మోదీ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని, దీనిని దృష్టిలో పెట్టుకున్న మోదీ అప్పట్లో ఓ సభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు నన్ను ఏమీ చెయ్యలేవు. నేను ఫకీర్‌ను. అవసరమైతే జోలెను తీసుకొని వెళ్లిపోతా అని చెప్పారని గుర్తుచేశారు. అప్పట్లో ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం అవుతున్నాయన్నారు. బీజేపీలో సీనియర్ నేత అయిన శత్రుఘ్నసిన్హా అధిష్ఠానంతో పొసగక బయటికొచ్చి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఒకవేళ ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మీ దగ్గరికి వస్తే మీరు ఏమని చెబుతారని ఎన్డీటీవీ విలేకరి అడిగిన ప్రశ్నకు శత్రుఘ్నసిన్హా సమాధానమిస్తూ అనవసరంగా ఎదుటి వారిపై నిందలు వేయవద్దని, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సూచిస్తానని తెలిపారు.

153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles