పాతనోట్లతో 80 వేలకోట్ల రుణాల చెల్లింపుWed,January 11, 2017 12:46 AM

న్యూఢిల్లీ, జనవరి 10: పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో భారీ మొత్తంలో డిపాజిట్ అయిన ఖాతాలపై అదాయం పన్ను (ఐటీ) దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల శాఖల్లోనూ రూ. 2 క్షలకుపైగా జరిగిన నగదు లావాదేవీలపై నిఘా పెట్టింది. మంగళవారం ఐటీ అధికారులు పలు వివరాలను మీడియాకు వెల్లడించారు. 60 లక్షలకుపైగా బ్యాంకు ఖాతాల్లో ఒక్కోఖాతాలో రూ.2 లక్షలపైగా డిపాజిట్ అయినట్టు తెలిపారు. పెద్దనోట్లు రద్దు తర్వాత పాతనోట్లతో రూ.80,000 కోట్ల రుణాలను రుణగ్రస్తులు చెల్లించారని వివరించారు. దేశవ్యాప్తంగా లెక్కలోకిరాని రూ.3-4 లక్షల కోట్ల అక్రమ సొత్తును బ్యాంకు ఖాతాల్లో కొందరు జమ చేశారని అన్నారు. ఇలా ఈశాన్య రాష్ర్టాల్లోని బ్యాంకుఖాతాల్లోనే రూ.10,700 కోట్లు డిపాజిట్ అయినట్టు చెప్పారు. కోఆపరేటివ్ బ్యాంకుల్లో రూ.16 వేల కోట్లు జమైనట్టు, ముఖ్యంగా నిద్రాణ ఖాతాల్లోనే రూ.25వేల కోట్లు డిపాజిట్ చేసినట్టు వెల్లడించారు. కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన రూ.16 వేల కోట్లు, రీజనల్ రూరల్ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రూ.13 వేల కోట్లపై ఐటీశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఉగ్రవాద ప్రభావిత రాష్ర్టాల్లోనూ భారీమొత్తంలో బ్యాంకుఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తంపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు. ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాచారం ఆధారంగా జన్‌ధన్ ఖాతాలో రూ.1 లక్షకుపైగా జమ వాటిపై దృష్టిపెట్టినట్టు వివరించారు.

289
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS