నా వారసుడు భారతీయుడే


Wed,March 20, 2019 03:00 AM

The next Dalai Lama could be found in India

-చైనీయులు ఎంపికచేసే వ్యక్తికి గౌరవం దక్కదు
-టిబెటన్ల ఆధ్యాత్మిక నేత దలైలామా స్పష్టీకరణ

ధర్మశాల, మార్చి 19: తాను మరణించిన తరువాత తన అవతారాన్ని (వారసుడిని) భారత్‌లోనే కనుగొనవచ్చని టిబెటన్ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా (83) చెప్పారు. చైనా ఎంపికచేసే వారసుడికి గౌర వం దక్కదని ఆయన స్పష్టం చేశారు. దలైలామా టిబెట్ నుంచి తప్పించుకొని భారత్ వచ్చి 60 ఏండ్లు గడిచిన సందర్భంగా ఆయ న శిష్యులు ఆదివారం వార్షికోత్సవాలు నిర్వహించారు. 1959లో చైనా పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు విఫలం కావడంతో దలైలామా సైనికుని వేషంలో టిబెట్ రాజధాని లాసా నుంచి తప్పించుకొని భారత్ చేరుకున్నారు. అప్పటినుంచి ఆయన టిబెట్‌కు భాషాపరమైన, సంస్కృతిపరమైన స్వయంప్రతిపత్తిని సాధించేందుకు ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్నారు.

1950లో టిబెట్‌ను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న చైనా.. దలైలామాను ప్రమాదకరమైన వేర్పాటువాదిగా పరిగణిస్తున్నది. తన సుదీర్ఘపోరాటంలో నోబెల్ శాంతి బహుమతి కూడా పొందిన దలైలామా రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తన మరణానంతరం చైనా టిబెటన్ బౌద్ధుల కోసం ఒక వారసుడిని ఎంపిక చేయవచ్చని చెప్పారు. దలైలామా పునర్జన్మకు చైనా ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. వారికి నాకన్నా తదుపరి దలైలామా గురించే చింత ఎక్కువ అని అన్నారు. భవిష్యత్తులో ఇద్దరు దలైలామాలను మీరు చూసే అవకాశం ఉంది. ఒకరు భారతదేశం నుంచి వస్తారు. మరొకరిని చైనా ఎంపిక చేస్తుంది. కానీ చైనా ఎంపిక చేసిన వ్యక్తిని ఎవరూ గౌరవించరు అని చెప్పారు.

1328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles