నోరు జారినందుకు మంత్రి పదవి ఊడింది!


Tue,March 13, 2018 01:09 AM

The minister was in charge of the mouth

minister
జమ్ము: కశ్మీర్ సమస్యపై నోరు జారినందుకు ఓ మంత్రి తన పదవిని కోల్పోయారు. ఈ ఘట న జమ్ముకశ్మీర్‌లో జరిగింది. ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి హసీబ్‌డ్రబూ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, కశ్మీర్ అంశం రాజకీయ సమస్య కానేకాదని, 50-70 ఏండ్లుగా దానిని రాజకీయ సమస్యగా చిత్రీకరించారని, అది తప్పని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్న సీఎం మెహబూబా ముఫ్తీ.. హసీబ్‌ను తన మంత్రివర్గం నుంచి తప్పించాలని భావిస్తున్నానని గవర్నర్‌కు సోమవారం లేఖ రాశారు. గవర్నర్ సమ్మతించటంతో హసీబ్ మాజీ మంత్రిగా మారిపోయారు. రాష్ట్రంలో పీడీపీ-బీజేపీ కూటమిని ఏర్పాటు చేయటంలో హసీబ్ ముఖ్యపాత్ర పోషించారు.

540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles