నా కూతుళ్లు ఎక్కడ?


Tue,February 12, 2019 01:17 AM

The girls mother complained on mla chintamaneni prabhakar rao

-ఎమ్మెల్యే చింతమనేనిని కలిసి తిరిగిరాలేదు
-అమ్మాయిల తల్లి ఫిర్యాదు.. ఏపీలో కలకలం
విజయవాడ: విజయవాడలోని గుణదలలో అమ్మాయిల అదృశ్యం కలకలం సృష్టిస్తున్నది. అదృశ్యమైనవారిలో ఓ మైనర్ ఉన్నట్టు తెలిసింది. దీనివెనుక ఏపీలోని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హస్తం ఉన్నట్టు సమాచారం. ఈ నెల 4న చింతమనేనిని కలిసేందుకు వెళ్లిన తమ పిల్లలు కనిపించడంలేదని యువతుల తల్లి కోటా జ్యోతి సోమవారం మాచవరం పోలీసులను ఆశ్రయించారు. ఎమ్మెల్యేను కలువడానికి వెళ్లినప్పటినుంచి వారి వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదని, వారి ఫోన్లలో సంప్రదిస్తుంటే స్విచ్చాఫ్ వస్తున్నదని తెలిపారు. తమ పిల్లల ఆచూకీ తెలుపాలని వేడుకున్నారు. అయితే, అదృశ్యమైన ఈ అమ్మాయిలపైనే గతంలో ఎమ్మెల్యే బొండా ఉమ అనుచరులు అత్యాచారయత్నం చేశారు. పక్కాగృహం ఇప్పిస్తామని నమ్మించి ఉమ ఆఫీస్‌కే తీసుకెళ్లి ఈ ఘోరానికి పాల్పడ్డారు. అప్పటినుంచి తమకు వేధింపులు ఎక్కువయ్యాయని జ్యోతి ఆవేదన వ్యక్తంచేశారు.

158
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles