గగనతలంలో విమానంలోకి ఇంధనం


Tue,September 11, 2018 02:13 AM

The fuel filling process was successful from IL 78 aircraft to Tejas

-ఐఎల్78 విమానం నుంచి తేజస్‌లోకి ఇంధనం నింపే ప్రక్రియ విజయవంతం
బెంగళూరు: గగనతలంలో ఓ విమానం నుంచి మరో విమానంలోకి ఇంధనం నింపే ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసినట్టు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏల్) సోమవారం తెలిపింది. దీంతో ఆకాశంలోనే యుద్ధ విమానాల్లో ఇంధనం నింపగల అగ్రరాజ్యాల సరసన భారత్ చేరిందని పేర్కొన్నది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లోకి 1,900 కిలోల ఇంధనాన్ని ఆకాశంలో వైమానిక దళానికి చెందిన ఐఎల్ 78 విమానం నుంచి నింపినట్టు తెలిపింది. భూమికి 20 వేల అడుగుల ఎత్తున తొలిసారి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు హెచ్‌ఏఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రక్రియపై వైమానిక దళం ఇటీవలే డ్రైరన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. డ్రైరన్ విజయవంతమైన నేపథ్యంలో ఇంధనాన్ని (వాస్తవంగా) నింపే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాం అని ఆ ప్రకటన పేర్కొంది.

756
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles