సతత హరిత విప్లవం రావాలి

Sat,May 20, 2017 01:44 AM

book
న్యూఢిల్లీ: వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సతత హరిత విప్లవం కోసం పాటుపడాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రతకు మారాలని కూడా ఆయన చెప్పారు. ఇందుకు శాస్త్ర, సాంకేతికరంగం అండదండలు కావాలని అన్నారు.

-ప్రధాని నరేంద్రమోదీ పిలుపు
-స్వామినాథన్ నివాసంలో పుస్తకావిష్కరణ

ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ నివాసంలో ఎంఎస్ స్వామినాథన్: ఏ క్వెస్ట్ ఫర్ వరల్డ్ వితౌట్ హంగర్ అనే పుస్తకాల సిరీస్‌ను ప్రధాని ఆవిష్కరించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న తపనతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని మోదీ చెప్పారు. దేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి స్థితిలో ముందుకు వెళ్లడం సాధ్యం కాదని అన్నారు. పోషకాహార లోపం పెద్ద సమస్యగా ఉందని, పప్పుదినుసుల్లో పోషకాల స్థాయిపెంచేందుకు కృషి జరుగాలని ప్రధాని సూచించారు. సాంప్రదాయిక పద్ధతులను శాస్త్రీయ పద్ధతులతో మేళవించాలన్నారు.

68

More News