భద్రతాదళాల కాల్పుల్లో ఉగ్రవాది మృతిWed,January 11, 2017 12:42 AM

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని బందిపొర జిల్లా పారేమొల్లాలో భద్రతాదళాలు ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతిచెందగా, ఓ జవాను గాయపడ్డారని భద్రతా అధికారులు పేర్కొన్నారు. పారేమొల్లాలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో మంగళవారం ఉదయం సైన్యం, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌వోజీ) సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఓ వైపు సిబ్బంది తనిఖీలు చేపట్టగా మరోవైపు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన సైన్యం ఎదురుకాల్పులు జరుపడంతో ఓ ఉగ్రవాది మృతిచెందాడని ఆర్మీ అధికారి వెల్లడించారు.

275
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS