యుద్ధతంత్రం నూతన రూపం ఉగ్రవాదం


Thu,January 10, 2019 02:21 AM

Terrorism here to stay as long as nations use it as state policy

-ఉగ్రవాదులకు సోషల్ మీడియా వల్లే నిధులు లభ్యం
-ఆఫ్ఘన్‌లో శాంతి కోసం తాలిబన్లతో భేషరతుగా చర్చలు జరుపాలి
-సైనికాధిపతి బిపిన్ రావత్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఉగ్రవాదం అనేది యుద్ధతంత్రం నూతన రూపమని సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ అన్నారు. వివిధ దేశాలు ఉగ్రవాదాన్ని తమ విధానంగా అమలు చేస్తుండటంతో అది బహుళ తలల రాక్షసుడిగా ఎదుగుతున్నదన్నారు. రెచ్చగొట్టే ధోరణులను నిలువరించడంతోపాటు ఉగ్రవాదులకు నిధులు అందకుండా సోషల్ మీడియాపై కొంత నియంత్రణ పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. బుధవారం ఆయన రైజీనా డైలాగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆఫ్ఘన్‌లో శాంతి స్థాపనకుకు తాలిబన్లతో భేషరతుగా చర్చలు జరుపాలన్నారు. ఒక బలహీన దేశం ఉగ్రవాదులతో ఇతర దేశాలపై పరోక్ష యుద్ధానికి పాల్పడుతున్నదని, అటువంటి విధానాలను సహించబోమని పాకిస్థాన్‌ను ఉద్దేశించి రావత్ అన్నారు. ఉగ్రవాదం విస్తరణకు, ఉగ్రవాదులకు ఆర్థిక వనరులను సమకూర్చేందుకు సోషల్ మీడియా ఒక వేదికగా మారిందని బిపిన్ రావత్ పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని విధానంగా అమలు చేస్తున్న దేశాల వల్లే కశ్మీర్‌లో ఉగ్రవాదం సుదీర్ఘకాలం మనుగడ సాధించగలుగుతున్నదని రావత్ తెలిపారు. కశ్మీర్ యువతను అబద్దాలు, తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గతంలో గెరిల్లా యుద్ధతంత్రం గురించి చర్చించే వారమని, ఇప్పుడది ఉగ్రవాదంగా రూపాంతరం చెందిందన్నారు.

378
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles