హఫీజ్‌సయీద్, సలాహుద్దీన్ రాజద్రోహంFri,January 19, 2018 12:34 AM

జిలానీ సహా మరో 10మందిపై ఎన్‌ఐఏ అభియోగాలు
న్యూఢిల్లీ, జనవరి 18: లష్కరే తాయిబా అధిపతి హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు సయ్యద్ సలాహుద్దీన్‌లు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద, వేర్పాటవాద కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు కుట్రపన్నారంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభియోగాలు మోపింది. ఈ ఇద్దరు ఉగ్రవాద సంస్థల నాయకులతోపాటు మరో పది మందిపై (వీరిలో జమ్ముకశ్మీర్‌కు చెందిన జిలానీతో పాటు పలువురు వేర్పాటువాద నేతలు కూడా ఉన్నారు) అభియోగాలు మోపుతూ 12,694 పేజీల చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు అందుతున్న నిధులకు సంబంధించిన దర్యాప్తును కొనసాగించేలా అనుమతించాలని కోర్టును కోరినట్లు ఎన్‌ఐఏ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

92

More News

VIRAL NEWS