అమరావతిలోనే తాత్కాలిక హైకోర్టుTue,February 13, 2018 01:42 AM

amaravathi-high-court
అమరావతి, నమస్తే తెలంగాణ: అమరావతిలో హైకోర్టు భవనాలు నిర్మించే ప్రాంతంలో లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ రూపొందించిన ప్లాన్ ప్రకారం తొలుత సిటీ సివిల్ కోర్టు నిర్మించాలని నిర్ణయించినట్టు ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి పీ నారాయణ వెల్లడించారు. ఏపీ సచివాలయంలో సోమవారం రాత్రి సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షత జరిగిన ఏపీసీఆర్‌డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రూ.108 కోట్లతో 8 నెలల్లో నిర్మాణం పూర్తిచేస్తామని, ఇందులోనే తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

329

More News

VIRAL NEWS