దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానంTue,February 13, 2018 01:40 AM

devipriya
న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగుకవి, జర్నలిస్టు దేవీప్రియ ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు అందుకున్నారు. గాలిరంగు పేరుతో ఆయన రాసిన కవితా సంపుటి ఈ జాతీయ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. అవార్డుల ప్రదానోత్సవం సోమవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. దేవీప్రియతోపాటు ఈ పురస్కారానికి ఎంపికైన వివిధ భాషలకు చెందిన 23 మంది ప్రముఖ రచయితలు, కవులకు అవార్డుల ప్రదా నం జరిగింది. అవార్డు కింద వారికి తామ్రఫలకం, శాలువా, లక్ష రూపాయల చెక్కు ఇచ్చి సత్కరించారు. అకాడమీ నూతన అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్, పెద్ద సంఖ్యలో వచ్చిన సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవీప్రియ మాట్లాడుతూ తన రచనకు అవార్డు ఇచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు.

171

More News

VIRAL NEWS