తేజస్ పరీక్ష విజయవంతం


Sat,September 14, 2019 02:11 AM

Tejas successfully performs critical test for naval deployment

- అరెస్ట్ ల్యాండింగ్ ప్రక్రియ సక్సెస్
- నౌకాదళ వెర్షన్ అభివృద్ధిలో కీలక ముందడుగు


న్యూఢిల్లీ: నౌకాదళ అవసరాలకు అనుగుణంగా తేజస్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయడంలో గొప్ప ముందడుగు పడింది. విమాన వాహకనౌకపై తేజస్‌ను ల్యాండ్ చేసే అరెస్ట్ ల్యాండింగ్ ప్రక్రియను శుక్రవారం విజయవంతంగా పరీక్షించినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరనుందన్నారు. గోవా తీరంలో ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సీఎస్‌ఐర్‌లతో కలిసి డీఆర్‌డీవో తేజస్ నావికాదళ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నది. భారత నౌకా విమానయాన చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు అని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. గోవాలో ఐఎన్‌ఎస్ హన్సపై నిర్వహించిన ఈ పరీక్ష.. భారత నౌకాదళ విమాన వాహక నౌక విక్రమాదిత్యపై ఎయిర్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసేందుకు మార్గం సుగమం చేసిందని తెలిపింది. ఇప్పటికే పలు తేజస్ యుద్ధ విమానాలు వాయుసేన అమ్ములపొదికి చేరాయి. తొలుత వాయుసేన 40 తేజస్ యుద్ధవిమానాల కోసం హెచ్‌ఏఎల్‌కు ఆర్డర్ ఇచ్చింది. గతేడాది మరో 83 యుద్ధ విమానాల కోసం హెచ్‌ఏఎల్‌కు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌ను పంపింది.

116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles