చింతమనేని అరెస్టు.. 25 వరకు రిమాండ్


Thu,September 12, 2019 02:17 AM

TDP leader Chintamaneni Prabhakar arrested in Duggirala

పశ్చిమగోదావరి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు బుధవారం అరెస్టయ్యారు. ఏలూరు ఎక్సైజ్ కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి ఆయనకు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించారు. దళితులను దూషించి.. దౌర్జన్యం చేసినట్టు కేసులు ఎదుర్కొంటున్న చింతమనేని పన్నెండురోజులుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య చింతమనేని బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు రెచ్చిపోయారు. చింతమనేని నివాసంలో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను అనుచరులు నిర్బంధించారు. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు చింతమనేని అరెస్టు చేశారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదుచేశారు.

152
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles