ఢిల్లీ పేలుళ్ల సూత్రధారికి పదేండ్ల జైలు

Fri,February 17, 2017 04:42 AM

న్యూఢిల్లీ: ఢిల్లీలో 2005లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడి 60 మంది ప్రాణాలను పొట్టన బెట్టుకున్న సూత్రధారి తారిక్ అహ్మద్ దార్‌కి పదేండ్ల జైలుశిక్ష పడింది. ఈ కేసులో మిగతా ఇద్దరు నిందితులు మహ్మద్ రఫీక్ షా, మహ్మద్ హుస్సేన్ ఫాజిలిలు నిర్దోషులుగా బయటపడ్డారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 38, 39 కింద దార్‌ను దోషిగా తేల్చారు. అతడికి పదేండ్ల జైలుశిక్ష పడినా, మిగతా ఇద్దరు నిందితులతో బయటకు వెళతాడు. ఎందుకంటే అతను ఇప్పటికే 12 ఏండ్ల జైలుశిక్షను అనుభవించాడు.

tariq ahmed dar sentenced 10 years delhi serial blasts
ఆయుధాలు సేకరించి ఢిల్లీపై యుద్ధం చేసినందుకు, అమాయకులపై హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడినందుకు మిగతా ఇద్దరు నిందితులతో పాటు దార్‌కు వ్యతిరేకంగా కోర్టు 2008లో ఆరోపణలు మోపింది. దార్ చేసిన ఫోన్ సంభాషణల ఆధారంగా అతను లష్కర్-ఎ-తోయిబాతో ఉగ్ర సంస్థతో పనిచేస్తున్నట్లు వెల్లడైందని ఢిల్లీ పోలీసులు దార్‌పై చార్జిషీటు దాఖలు చేశారు. అయితే తీర్పుపై బాధితుల కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పును తాము హైకోర్టులో సవాలు చేస్తామని అన్నారు.

tariq ahmed dar sentenced 10 years delhi serial blasts

ఆ రోజు రక్తపాతం


అది 2005, అక్టోబర్ 29. మరో రెండురోజుల్లో దీపావళి. ఢిల్లీ మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా ఉన్నాయి. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు వరుస బాంబుపేలుళ్లతో విరుచుకుపడ్డారు. ఢిల్లీ మార్కెట్లను రక్తంతో తడిపారు. పేలుళ్ల ధాటికి కొంతమంది శరీరాలు ముక్కలు ముక్కలై ఎగిరిపడ్డాయి. ఆ ప్రాంతాల్లో తీవ్ర భయానక వాతావరణం ఉన్నది. పహార్‌గంజ్ నెహ్రూ మార్కెట్లో చాహ్‌టూటి చౌక్‌లో 5.38 గంటలకు ఒక నగల దుకాణం వద్ద మొదటి పేలుడు జరిగింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతంలోని ఇండ్ల తలుపులు పగిలిపోయాయి, స్తంభాలు కూలిపోయాయి. కాస్మెటిక్ దుకాణం నడిపే రఘునాథ్ సిక్కా అనే వ్యక్తి పేలుడు శబ్దానికి గుండెపోటుకు గురయ్యారు. కొంతమంది పేలుడుతో చెలరేగిన మంటల్లో కాలిపోయారు. మళ్లీ 14 నిమిషాల అనంతరం 5.52 నిమిషాలకు ఔటర్ రింగ్‌రోడ్డులో మరో ఘటన జరిగింది.

గోవింద్‌పురి, ఓక్లా ఫేస్1 వద్ద బహ్రి ముద్రిక బస్సులో కండక్టర్.. ఒక సీటు కింద అనుమానాస్పద సంచిని కనుగొన్నారు. బస్సులో ఆయనతో పాటు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. కండక్టర్ వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేసి బస్సును ఆపించారు. ఆయన ప్రాణాలకు తెగించి సంచిని తీసుకొని విసిరి వేయబోతుండగా బాంబు పేలింది. ప్రమాదంలో కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కంటిచూపును కోల్పోయారు. నాలుగు నిమిషాల తర్వాత 5.56 గంటలకు సరోజినినగర్‌లో మరో భయానక ఘటన చోటుచేసుకున్నది. పండ్లరసం దు కాణం పక్కన అనుమానాస్పద సంచిలో ఉన్న బాం బు పేలింది. అనంతరం వరుస బాంబు పేలుళ్లలో 67 మంది చనిపోగా, 200 మంది గాయపడ్డారు. ఇదేఏడాది మేలో కూడా లిబర్టీ, సత్యం సినిమా థియేటర్లలో బాంబు పేలుళ్లు సంభవించాయి.

1170

More News