రాజీవ్ హంతకులను విడుదల చేయాలి


Mon,September 10, 2018 01:33 AM

Tamil Nadu govt recommends release of Rajiv Gandhi killers

తమిళనాడు ప్రభుత్వం తీర్మానం
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం చెన్నైలో సీఎం పళనిస్వామి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించి, దానిని వెంటనే గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్‌కు పంపింది. మురుగన్, శంతన్, పెరారివలన్, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ పయాస్, నళినిలను విడుదల చేయాలని క్యాబినెట్ తీర్మానించిందని, క్షమాభిక్షపై నిర్ణయం గవర్నర్‌దేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు చేసిన సూచనమేరకు ఈ తీర్మానం చేశామని రాష్ట్ర మంత్రి జయకుమార్ తెలిపారు.

551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles