అడవుల్లో మంటలు.. 9కి చేరిన మృతుల సంఖ్యTue,March 13, 2018 01:24 AM

-27 మందిని రక్షించిన వాయుసేన కమెండోలు
-ఒకరి పరిస్థితి విషమం, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

Theni-relatives
థేని: తమిళనాడులోని థేని జిల్లా కరుగుమలై అడవుల్లో మంటల్లో చిక్కుకుని మరణించిన పర్వతారోహకుల సంఖ్య 9కి చేరిం ది. 27మంది సురక్షితంగా బ యట పడ్డారు. మృతుల్లో ఆరుగురు చెన్నై వాసులు, ముగ్గురు ఈరో డ్ వాసులుగా గుర్తించారు. ఆదివారం పర్వతారోహణకు వెళ్లిన 36మంది బృందం ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో 25 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులని థేని జిల్లా కలెక్టర్ పల్లవి బాల్‌దేవ్ తెలిపారు. వారిని రక్షించేందుకు నాలుగు వాయుసేన హెలికాప్టర్లు సహా 10 మంది కమెండోలు రంగంలోకి దిగారు. అనునిత్య అనే అమ్మాయికి 90%గాయాలవగా, మరో ఇద్దరు 20 శాతం గాయపడ్డారు అని కేంద్ర రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ట్వీట్ చేశారు. 9 మంది క్షతగాత్రులకు బోడి ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.

183

More News

VIRAL NEWS