రేపిస్టులకు తక్షణమే శిక్షలు విధించాలి

Wed,December 4, 2019 03:08 AM

- నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన స్వాతి మలివాల్‌


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహిళలపై లైంగికదాడులకు నిరసనగా ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ మంగళవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. దోషులకు కఠిన శిక్షలు విధించి, సత్వరమే వాటిని అమలు చేయాలని డిమాండ్‌చేశారు. వందల మంది మహిళలు ఆమెతో కలిసి గొంతుకలిపారు. నేరం నిరూపితమైన ఆరు నెలల్లో దోషులకు శిక్షను అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు మలివాల్‌ తెలిపారు. ‘రేపిస్టులకు కఠిన శిక్షలు విధించాలని ప్రధానిని డిమాండ్‌ చేస్తున్నా. దిశ ఘటనలో దోషులను ఉరితీయాలి. గతేడాది నేను నిరహార దీక్ష చేసినప్పుడు, మైనర్లపై దాడికి పాల్పడేవారికి ఆరునెలల్లో కఠిన శిక్ష విధించేలా పదిరోజుల్లోనే ప్రభుత్వం చట్టం చేసిం ది. కానీ అది అమలుకాలేదు. చట్టాన్ని అమలుచేయాలని ప్రధానిని కోరుతున్నా’ అని అన్నారు. ‘మేం మీ వెంటే ఉన్నామని ప్రధాని భరోసా ఇవ్వాలి. మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు’ అని ఆమె పేర్కొన్నారు.

727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles