రామకృష్ణ మఠం చైర్మన్ స్వామి ఆత్మస్థానానందజీ మృతిMon,June 19, 2017 02:06 AM

Athamasthananda
కోల్‌కతా, జూన్ 18: పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా నగరంలో సుదీర్ఘ కాలంగా చికిత్స పొందుతున్న రామకృష్ణ మఠం చైర్మన్ స్వామి ఆత్మస్థానానందజీ (98) ఆదివారం మరణించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందజేస్తున్నా కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతూ వచ్చింది. రామకృష్ణ మిషన్ సేవా దవాఖానలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు కన్నుమూశారని రామకృష్ణ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం రాత్రి 9.30 గంటలకు బెలూర్‌లో ఆయన అంత్య క్రియలు జరుగుతాయి. ఆయన అంతిమయాత్ర ప్రారంభమయ్యే వరకు బెలూర్‌లోని రామకృష్ణ మఠంలో ఆత్మస్థానానందజీ పార్ధివ దేహాన్ని సందర్శించేందుకు అనుమతినిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. స్వామి ఆత్మస్థానానందజీ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి స్వామి ఆత్మస్థానానందజీ తనకు ఆధ్యాత్మికంగా మార్గదర్శకం చేస్త్తూ ఉండేవారని తెలిపారు. ఆత్మస్థానానందజీ మృతి పట్ల పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర సంతాపం తెలిపారు. ఆత్మస్థానానందజీ 1919 మేలో ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సమీపంలోని సబజ్‌పూర్‌లో జన్మించారు. 1938లో స్వామి విజ్ఞానానందజీ మహరాజ సారథ్యంలో మంత్రదీక్ష పొందారు. తన 22వ ఏట 1945లో బేలూర్‌లోని రామకృష్ణమఠ్‌లో చేరారు. 1945లో రామకృష్ణ మఠం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

830

More News

VIRAL NEWS